Somehow, the thrill of watching dinosaurs eat people doesn’t get old, which is one reason why we’re getting a sequel to 2015’s Jurassic World, Jurassic World: Fallen Kingdom.
ప్రపంచ సినిమా చరిత్రలో అద్భుత సృష్టి అని చెప్పుకోదగ్గ వాటిలో 'జూరాసిక్ పార్క్' సిరీస్ చిత్రాలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. లక్షల సంవత్సరాల క్రితం భూమిపై ఉనికిలో ఉన్న డైనోసార్స్‌ను సినిమా రూపంలో మన కళ్ల ముందుకు తెచ్చి ఆశ్చర్యపరిచారు ప్రముఖ ఫిల్మ్ మేకర్ స్టీవెన్ స్పీల్ బర్గ్. ఇప్పటికే ఈ సిరీస్‌లో వచ్చిన అనేక చిత్రాలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయి. ప్రస్తుతం ఉన్న 3డి టెక్నాలజీతో డైనోసార్స్ కళ్ల ముందే కదలాడిన అనుభూతిని పొందుతున్నారు ప్రేక్షకులు.
ఈ సిరీస్‌లో చివరగా 2015లో ‘జూరాసిక్ వరల్డ్' సినిమా వచ్చింది. దీనికి సీక్వెల్‌గా ‘జూరాసిక్ వరల్డ్: పాలెన్ కింగ్‌డమ్' అనే సినిమా రాబోతోంది. 2018 లో ఈ చిత్రం విడుదల చేసేందకు ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా ‘జూరాసిక్ వరల్డ్: పాలెన్ కింగ్‌డమ్' చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ ట్రైలర్ చూస్తే మరోసారి డైనోసార్స్ ప్రపంచంలోకి వెళ్లి వాటిని చూడాలనే ఆసక్తి కలుగడం ఖాయం.